దేన్ని ఎంచుకోవాలి.. ఎందుకు?
పెట్టుబడులు పెట్టేందుకు నేడు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ మదుపరుల్లో ఒకింత అయోమయం ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ సంబంధిత ఇన్వెస్ట్మెంట్లపై ఇది ఇంకా ఎక్కువే. ఈ క్రమంలోనే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఏది ఉత్తమం? దేన్ని ఎంచుకోవాలి? ఎందుకు? అన్నదానిపై నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం.
యువ మదుపరులు పెట్టుబడులకున్న రకరకాల మార్గాలపై సహజంగానే దృష్టి సారిస్తారు. కొందరు స్టాక్స్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపితే.. మరికొందరు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో రెండు విస్తృత శ్రేణి మార్గాలున్నాయి. అవే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్.
డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, పేటీఎం మనీ, గ్రో, కాయిన్ వంటి డిజిటల్ వేదికల ద్వారా నేరుగా మదుపరులు కొనేందుకు వీలున్న మార్గమే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్.
రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్
పెట్టుబడులకు ఆసక్తి ఉన్న మదుపరులు సాధారణంగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కొంటూ ఉంటారు. వీటినే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌గా పిలుస్తారు.
ఇదీ సంగతి..