హైదరాబాద్, మే 30: డిజిటల్ సొల్యుషన్స్ సంస్థ డిజిలాజిక్ సిస్టమ్స్..హైదరాబాద్‌లో యూనిట్‌ను నెలకొల్పడానికి సిద్ధమైంది. హార్డ్‌వేర్ పార్క్‌లో రూ.51.74 కోట్ల పెట్టుబడితో 65 వేల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నెలకొల్పుతున్న ఈ యూనిట్ వచ్చే ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ సీఈవో శశాంక్ వర్మ జెట్టి తెలిపారు. ప్రస్తుతం ఈ యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, దీంతో ఎంతోమందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను డిజిలాజిక్ సిస్టమ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.78.27 కోట్ల ఆదాయంపై రూ.10.43 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఆదాయంతో పోలిస్తే7.5 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, లాభాల్లో 33.8 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.31 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి.