Dhanteras 2022 | బంగారం కొనుగోలుకు బెస్ట్ టైం.. ఇదీ పూజా ముహూర్తం !
Dhanteras 2022 | ధంతేరాస్ నాడు బంగారం కొనుగోలు చేయడం వల్ల తమ కుటుంబంలోకి లక్ష్మీదేవి వస్తుందని భారతీయులు నమ్ముతుంటారు.
Dhanteras 2022 | ధన త్రయోదశి అంటే ధంతేరాస్‌గా పాపులర్. ప్రతియేటా ఐదు రోజులు సాగే దీపావళి వేడుకలు ధంతేరాస్‌తోనే మొదలవుతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతియేటా ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం 13వ రోజు వచ్చే తిథి త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ధంతేరాస్ సందర్భంగా వీసమెత్తైనా బంగారం కొనుగోలు చేయాలని భారతీయులు భావిస్తారు. బంగారంతోపాటు వెండి, గృహోపకరణాలు, పాత్రలు తదితర వస్తువులను కొనుగోలు చేయడంతో తమ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం.
ఈ ఏడాది ధంతేరాస్ పూజా సమయం శనివారం (అక్టోబర్ 22) రాత్రి 7.00 గంటలకు మొదలై 8.17 గంటలకు ముగుస్తుంది. ధన త్రయోదశి పండుగను ఈ ఏడాది అక్టోబర్ 23 (ఆదివారం) జరుపుకుంటారు. ఆయుర్వేదానికి ఆధ్యుడిగా భావించే ధన్వంతరి జయంతి కూడా ఇదే రోజు.
అమృతం కోసం దేవ దానవులు పాల సముద్రాన్ని మధించినప్పుడు సంపదకు సంకేతంగా స్వర్ణ కలశంతో లక్ష్మీదేవి ఆవిర్భవించిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి గౌరవార్థం ప్రజలు ధంతేరాస్ రోజు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అలా చేయడం వల్ల తమ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తుంటారు.
బంగారం కొనుగోలు చేయడానికి శుభముహూర్తంగా ధంతేరాస్‌ను పరిగణిస్తారు. ఈ ఏడాది ధంతేరాస్ శనివారం సాయంత్రం 6:02 గంటల నుంచి మొదలై ఆదివారం సాయంత్రం 6:03 గంటల వరకు ముగుస్తుంది. కనుక శనివారం (అక్టోబర్ 22) రాత్రి నుంచి ఆదివారం (అక్టోబర్ 23) వరకు బంగారం కొనుగోలు చేయొచ్చు. ధంతేరాస్ పూజ సమయం శనివారం రాత్రి 7.01 గంటల నుంచి 8.17 గంటల వరకు ముగుస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

