ముంబై, మార్చి 12: దేశంలో విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు ఈ నెల 5తో ముగిసిన వారంలో 4.255 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 580.299 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాలు చెప్తున్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో తగ్గుదలే దీనికి కారణమని ఆర్బీఐ తెలిపింది.