Deepinder Goyal : ఆన్లైన్ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటో (Zomato) సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ (Deepinder Goyal) కీలక బాధ్యతల నుంచి వైదొలిగారు. మాతృసంస్థ ఎటెర్నల్ (Eternal) సీఈఓగా సేవలందిస్తున్న గోయల్ బుధవారం పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు మేనేజింగ్ డైరెక్టర్‌గానూ గోయల్ తప్పుకున్నారు. ఏకకాలంలో రెండు పదవులకు గుడ్ బై చెప్పేసిన దీపిందర్ గోయల్ ఎటరన్స్ వైస్ ఛైర్మన్‌గా, డైరెక్టర్‌గా పగ్గాలు చేపట్టనున్నారు.
జొమాటో, బ్లింకిట్‌కు మాతృసంస్థ అయిన ఎటెర్నల్‌లో నాయకత్వ మార్పుకు వేళైంది. దీపిందర్ గోయ్ సీఈఓగా రాజీనామా చేయడంతో బ్లింకిట్ సీఈఓ అభిందర్ సింగ్ ధిండ్సా కొత్త సీఈఓగా ఎంపికయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఎటర్నల్ కార్యనిర్వాహణాధికారిగా ఆయన సేవలందించనున్నారు.
Deepinder Goyal resigns as Eternal CEO; company names Albinder Dhindsa as successor https://t.co/hCnZrULuZJ pic.twitter.com/Fs0G7hcFx5
— Economic Times (@EconomicTimes) January 21, 2026
గురుగ్రామ్‌కు చెందిన ఎటెర్నల్ డిసెంబర్ 31 వరకూ ముగిసిన క్వార్టర్లో భారీ లాభాలు ఆర్జించింది. రూ.93 వేల కోట్లకు పైగా సంపద సమకూరింది. గత క్వార్టర్‌తో పోల్చేతే రెండింతల ఆదాయం వచ్చింది.