న్యూఢిల్లీ : తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకోన్‌ను (Deepika Padukone) ఎంచుకున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. షారుక్ ఖాన్ తర్వాత కార్ మేకర్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పడుకోన్ భారత సినీ పరిశ్రమ నుంచి రెండవ సెలబ్రిటీగా హ్యుందాయ్ ఇండియాకు వ్యహరించనుంది.
కాగా షారుక్ ఖాన్ స్ధానంలో దీపికా పడుకోన్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతుందా లేక ఇద్దరూ కలిసి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తారా అనే విషయంలో కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసాధారణ నైపుణ్యం, నటనా సామర్ధ్యం కలిగిన గ్లోబల్ ఇండియన్ ఐకాన్ దీపికా పడుకోన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం పట్ల తాము ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు.
ఆమె తిరుగులేని ఆకర్షణ శక్తి, అద్భుతమైన కెరీర్ హ్యుందాయ్ మోటార్ ఇండియా యంగ్, డైనమిక్ బ్రాండ్‌కు సరితూగుతుందని అన్నారు. దీపికాతో అనుబంధం తమ బ్రాండ్ ఉనికిని పెంచి తమ టార్గెట్ ఆడియన్స్‌తో కనెక్ట్ అవుతుందనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
Read More :