న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశవ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ పడిపోతున్నది. గడిచిన సంవత్సరంలో 1.39 కోట్ల పర్సనల్ కంప్యూటర్లు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది అమ్ముడైన దాంతో పోలిస్తే 6.6 శాతం తగ్గినట్లు ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్(ఐడీసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
పర్సనల్ కంప్యూటర్లలో డెస్క్‌టాప్, నోట్‌బుక్స్‌లు ఉన్నాయి. కంపెనీల పరంగా చూస్తే హెచ్‌పీ తొలి స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. 2023లో డెస్క్‌టాప్ విభాగం 6.7 శాతం వృద్ధిని కనబరుచగా..నోట్‌బుక్స్ 11.1 శాతం తగ్గగా, వర్క్స్టేషన్లు 14 శాతం చొప్పున తగ్గాయని వెల్లడించింది. కరోన తర్వాత పీసీల కొనుగోలు చేయడానికి కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో డిమాండ్ పడిపోయిందని ఐడీసీ ఇండియా సీనియర్ రీసర్చ్ హెడ్ భరత్ తెలిపారు.