న్యూఢిల్లీ, జూన్ 21: పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4.59 లక్ష కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలయ్యాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైన రూ.4.65 లక్షల కోట్లతో పోలిస్తే 1.39 శాతం తగ్గాయని పేర్కొంది. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు మందగించడం, అధికంగా రిఫండ్లు చెల్లింపులు జరపడం వల్లనే తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఏప్రిల్ 1 నుంచి జూన్ 19 మధ్యకాలంలో కార్పొరేట్ల లాభదాయకత, వ్యక్తుల ఆదాయం కేవలం 3.87 శాతం పెరిగి రూ.1.56 లక్షల కోట్లకు చేరకున్నాయి. గతేడాది ఇదే సమయంలో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 27 శాతం అధికమయ్యాయి. అలాగే కార్పొరేట్ల అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 5.86 శాతం అధికమై రూ.1.22 లక్షల కోట్లకు చేరుకోగా..కార్పొరేటేతర్లు, వ్యక్తిగత, హెచ్యూఎఫ్, సంస్థల ట్యాక్స్ వసూళ్లు 2.68 శాతం తగ్గి రూ.33,928 కోట్లకు పరిమితమయ్యాయి.