గౌతం ఆదానీకి షాక్.. రెండో ఆసియా కుబేరుడి స్థానానికి రాంరాం?!
గౌతం ఆదానీకి షాక్.. రెండో ఆసియా కుబేరుడి స్థానానికి రాంరాం?!| గౌతం ఆదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2 రోజుల్లో ఆదానీ గ్రూప్ స్టాక్స్ పతనం....

న్యూఢిల్లీ: తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐ ఖాతాలను మార్కెట్ నియంత్రణ సంస్థ ఎన్ఎస్డీఎల్ స్తంభింప జేసిందన్న వార్తలతో గౌతం ఆదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత రెండు రోజుల్లో ఆదానీ గ్రూప్ స్టాక్స్ పతనం కావడంతో గౌతం ఆదానీ వ్యక్తిగత సంపద 5.4 బిలియన్ల డాలర్లు (రూ. 39 వేల కోట్లు) హరించుకుపోయింది. దీంతో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఆదానీ స్థానం 16వ ర్యాంక్‌కు పడిపోయింది.
నిన్న, మొన్నటివరకు ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ తర్వాత స్థానంలో ఉన్న గౌతం ఆదానీ స్టాక్స్ పతనంతో రెండో కుబేరుడి ర్యాంక్‌ను పోగొట్టుకున్నారు. చైనాకు చెందిన ఝోంగ్ షాన్షాన్ ఇప్పుడు రెండో ఆసియా కుబేరుడిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన నికర సంపద 70 బిలియన్ల డాలర్లు. గౌతం ఆదానీ మొత్తం నికర సంపద 69.5 బిలియన్ల డాలర్లు.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇప్పటికీ ఆసియాలోనే అతిపెద్ద కుబేరుడిగా ఉన్నారు. ఆయన మొత్తం నికర సంపద 87.7 బిలియన్ల డాలర్లు. గత 24 గంటల్లో ముకేశ్ అంబానీ నికర సంపద 1.9 బిలియన్ల డాలర్లు పెరిగింది.
ముకేశ్ అంబానీ- గౌతం ఆదానీ వ్యక్తిగత సంపద మధ్య వ్యత్యాసం 18.2 బిలియన్ల డాలర్లు (రూ.1.33 లక్షల కోట్లు) పెరిగింది. ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో ముకేశ్ అంబానీది 11వ ర్యాంక్.
ఆదానీ గ్రూపులోని ఆరు సంస్థల షేర్లు ఐదు నుంచి 22% పతనం అయ్యాయి. అత్యధికంగా ఆదానీ ఎంటర్ప్రైజెస్ వాటా భారీగా నష్టపోయింది. ఆదానీ ఎంటర్ ప్రైజెస్ వాటా 22% నష్టపోయింది.
అంతర్గత ట్రేడింగ్‌లో ఆదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ రూ.1201 పలికింది. ఈ ఏడాదిలో ఆదానీ గ్రూప్ షేర్లు 346 శాతం వ్రుద్ధి చెందాయి.
టాప్ కుబేరుల్లో 8 మంది అమెరికన్లే
టాప్-10 కుబేరుల్లో ఎనిమిది మంది అమెరికన్లే. ఇద్దరు ఫ్రాన్స్ వ్యాపారులు ఉన్నారు. ఫ్రాన్స్ మల్టీ నేషనల్ కంపెనీ ఎల్ఎంవీహెచ్ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ వ్యక్తిగత సంపద 196 బిలియన్ల డాలర్లతో టాప్‌లో ఉన్నారు.
తర్వాత స్థానాల్లో అమెరికన్ బిలియనీర్లు జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్, ల్యారీ పేజ్, ల్యారీ ఎల్లిసన్, సెర్జన్ బ్రిన్ నిలిచారు. 91.9 బిలియన్ల డాలర్లతో ఫ్రాన్స్ వాసి ఫ్రాంకోయిస్ బాటెన్కోర్ట్ మేయర్స్ పదో స్థానంలో ఉన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Asia
- billioneer
- Gautham Adani
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

