న్యూఢిల్లీ, జూన్ 24 : మానవ వనరుల స్టార్టప్ డార్విన్‌బాక్స్..మూడోసారి ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ బైబ్యాక్‌ను రూ.86 కోట్లతో పూర్తి చేసింది. ఈ బైబ్యాక్‌తో 350 మంది ఉద్యోగులకు ప్రయోజనాలు లభించాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో గడిచిన నాలుగేండ్లలో మూడుసార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు భారత్‌తోపాటు ఉత్తర అమెరికా, దక్షిణాసియా, మధ్య తూర్పు దేశాల్లో 11 కార్యాలయాలు ఉన్నాయి.