డీ-మార్ట్ లాభం 643 కోట్లు
న్యూఢిల్లీ, జూలై 9: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లాభాల్లో అదరహో అనిపించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఆరింతలు పెరిగి రూ.642.89 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇది రూ.95.36 కోట్లుగా ఉన్నది. కంపెనీ విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 93.66 శాతం అధికమై రూ.10,038.07 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఏడాది ఇది రూ.5,183.12 కోట్లుగా ఉన్నది. గతేడాదిలో నమోదైన ఆర్థిక ఫలితాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదని, కరోనా సెకండ్ వేవ్‌తో గడిచిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు భారీగా పడిపోయాయని అవెన్యూ సూపర్‌మార్ట్ సీఈవో, ఎండీ నెవిల్ నోరోన్హా తెలిపారు. గత త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఖర్చులు 81 శాతం పెరిగి రూ.9,191.79 కోట్లకు చేరుకున్నాయన్నారు. రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకొని గడిచిన మూడేండ్లలో కొత్తగా 110 స్టోర్లు ప్రారంభించినట్లు, ప్రస్తుతం ఈ స్టోర్లు అంచనావేసిన స్థాయిలో నడుస్తున్నాయన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ కొత్తగా 10 స్టోర్లు ప్రారంభించింది సంస్థ.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- D mart
- MD Neville Noronha
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

