న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కినెటిక్ టెక్నాలజీస్‌లో సైయెంట్ సెమీకండక్టర్స్ మెజారిటీ వాటాను దక్కించుకున్నది. ఈ మేరకు గురువారం సైయెంట్ తెలియజేసింది. ఈ డీల్ విలువ 93 మిలియన్ డాలర్లదాకా ఉంటుందని తెలుస్తున్నది.
కాగా, కినెటిక్ టెక్నాలజీస్.. హై-పర్ఫార్మెన్స్ అనలాగ్, మిక్స్డ్-సిగ్నల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను రూపొందించి, అభివృద్ధిపర్చి, మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీంతో పవర్ సెమీకండక్టర్ మార్కెట్లో ఇక సైయెంట్ మరింత బలోపేతం కానున్నది.