హైదరాబాద్, ఏప్రిల్ 21: సైయెంట్ డీఎల్ఎం నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 27.7 శాతం తగ్గి రూ.22.44 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.31 కోట్ల లాభాన్ని గడించింది. అలాగే సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం 13.8 శాతం తగ్గి రూ.369.07 కోట్లకు దిగొచ్చింది. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.2,416 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,261.48 కోట్ల ఆదాయంపై రూ.73.28 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటోమోటివ్, దేశీయ డిఫెన్స్, ఏఐ ఇన్ఫ్రా మార్కెట్, వర్టికల్ ఇంటిగ్రేషన్ కేబుల్ మార్కెట్లపై దృష్టి సారించనున్నట్టు పేర్కొంది.