హైదరాబాద్, ఫిబ్రవరి 19 : హైదరాబాద్ కేంద్రస్థానంగా ఐటీ కార్యకలాపాలు అందిస్తున్న సైయెంట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సుకమల్ బెనర్జీ నియమితులయ్యారు. ఈ నియామకం బుధవారం నుంచి అమలులోకి వచ్చినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఐదేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.