Crypto Currencies | గోల్డెన్ అవతార్‌గా చెప్పుకుంటున్న క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన వారు విలవిల్లాడుతున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో క్రిప్టో ఎక్స్చంజ్లు, వాటి నిర్వాహకుల సంపద రోజురోజుకు పడిపోతోంది. కాయిన్‌బేస్ గ్లోబల్ ఇంక్ ఫౌండర్ బ్రెయిన్ఆర్మ్స్ట్రాంగ్ వ్యక్తిగత సంపద నవంబర్‌లో 13.7 బిలియన్ల డాలర్లు ఉంటే.. మార్చి నాటికి 8 బిలియన్లకు.. ఇప్పుడు 2.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
బిట్ కాయిన్ నుంచి ఎథేర్ వరకు క్రిప్టో కరెన్సీ టోకెన్ల విక్రయాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఫలితంగా అమెరికాలోని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్‌బేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రోజురోజుకు పడిపోతున్నది. గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కాయిన్‌బేస్ షేర్లు 84 శాతం నష్టపోయాయి. క్రిప్టో కరెన్సీల్లో మేజర్ బిట్ కాయిన్, తర్వాతీ స్థానంలో ఉన్న ఎథేర్ గతేడాది ఆల్‌టైం రికార్డు నమోదు చేశాయి. నాటి నుంచి 50 శాతానికి పైగా విలువ కోల్పోయాయి.
ఫలితంగా దాదాపు క్రిప్టో కరెన్సీ హోల్డర్లు తమ వ్యక్తిగత సంపద కోల్పోయారు. వారిలో అత్యధికంగా సంపద నష్టపోయారు. చాలా మంది నష్టాలపాలయ్యారు. అలా నష్టాల పాలైన వారిలో క్రిప్టో ఎక్స్చేంజ్ల వ్యవస్థాపకులు ఉన్నారు. ఎక్స్చేంజ్ల ద్వారా ట్రేడర్లు క్రిప్టో కరెన్సీల క్రయ విక్రయాలు చేస్తుంటారు. ఫలితంగా ఎక్స్చేంజ్ల నిర్వాహకులు నష్టాల పాలవుతున్నారు.