అప్పుల ఊబిని తప్పించే మార్గాలేవి!దుర్వినియోగం చేస్తే క్రెడిట్ కార్డులు అప్పుల ఊబిలోకి లాగేస్తాయి. కానీ క్రమశిక్షణతో వాడుతూ.. పూర్తిస్థాయిలో చెల్లింపులు జరిపి, ఖర్చులను అదుపులో పెడితే మీ రుణపరపతిని అమాంతం పెంచేస్తాయి. అధిక వడ్డీరేట్లు, ఆర్థిక ఒత్తిళ్లనూ అధిగమించవచ్చు. ఇంతకీ క్రెడిట్ కార్డులు.. వినియోగదారులపట్ల వరమా..? శాపమా..? రుణాల ఉచ్చు నుంచి తప్పించుకోవడానికున్న మార్గాలేవి?
దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెద్ద ఎత్తున పెరిగిపోయింది. గత కొన్నేండ్లలో క్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య జెట్ స్పీడ్తో పెరిగిపోయిందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. మార్కెట్లో సులభంగానే క్రెడిట్ కార్డులు లభిస్తుండటం, ఆకర్షణీయ ఆఫర్లు, పెరిగిన వినీమయ శక్తి.. ఇవన్నీ కూడా ఇందుకు కారణమే. అయితే మితిమీరుతున్న క్రెడిట్ కార్డుల వినియోగం.. కార్డుదారులు, గృహస్తులను అప్పుల ఊబిలోకి లాగుతున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. కానీ రుణ సాధనాలను వాడుతున్నప్పుడు క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎలా ఉంటున్నారు? మరెలా ఆలోచిస్తున్నారు? అన్నది ఇక్కడ ప్రశ్న. మరి దీనిపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు?
ఇదీ సంగతి..
అధిక వడ్డీరేట్లు క్రెడిట్ కార్డు వినియోగదారులను అప్పుల ఊబిలో పడేస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం వాడకంలో ఉన్న చాలా క్రెడిట్ కార్డులపై యూజర్లు గడువులోగా బకాయిలను చెల్లించకపోతే గరిష్ఠంగా 30 నుంచి 42 శాతం చార్జీలు పడుతున్నాయి. చిన్నచిన్న బకాయిలపైనా వడ్డీ భారం తడిసి మోపెడవుతున్నది. ఇక ఎడాపెడా ఖర్చులు చేసి, ఆపై మొత్తం బకాయిలను చెల్లించకుండా చాలామంది మినిమం పేమెంట్స్తోనే సరిపెడుతున్నారిప్పుడు. దీనివల్ల కార్డును అప్పటికప్పుడు యాక్టివ్గా ఉంచుకుంటున్నా.. దీర్ఘకాలంలో మాత్రం యూజర్లు అప్పుల ఊబిలో పడే ప్రమాదం ఏర్పడుతున్నది. ‘ఇప్పుడు వాడుకోండి.. ఆ తర్వాత చెల్లించండి’, ‘సులభ వాయిదాల్లో పేమెంట్స్ చేయండి’.. ఇలా రకరకాల ఆఫర్లు క్రెడిట్ కార్డు యూజర్లను అవసరం లేకపోయినా ఖర్చులకు ప్రేరేపిస్తున్నాయి. ఫలితంగా చివరకు డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నవారెందరో.
ఇవే సమస్యలు
క్రెడిట్ కార్డులను అజాగ్రత్తగా వాడితే అప్పుల కుప్పే. క్రమశిక్షణతో వినియోగిస్తేనే సత్ఫలితాలుంటాయి. అందుకే క్రెడిట్ కార్డును ఓ స్వల్పకాలిక రుణంగా భావించాలి. కొనుగోళ్లు, ఖర్చులపై అవగాహన ఉండాలి. బకాయిలను పూర్తిగా చెల్లిస్తే రుణ పరపతి పెరుగుతుంది. ఇస్తున్నారుకదా అని ప్రతీ కార్డునూ తీసుకోవద్దు. రెండుకు మించి క్రెడిట్ కార్డులుంటే రుణ భారమే. కార్డుకున్న రుణ పరిమితిని పూర్తిగా వాడుకోవద్దు. 70 శాతం మించి వాడకపోవడమే మంచిది.
– కుందన్ షాహి, జవో వ్యవస్థాపకుడు
ఇలా చేయండి..