ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త నెమ్మదించింది. ఆగస్టు చిల్లర ద్రవ్యోల్బణం 6.83 శాతంగా నమోదైతే.. సెప్టెంబర్లో 5.02 శాతానికి చేరుకున్నది. రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలల తర్వాత ఆర్బీఐ నియంత్రణ స్థాయి ఆరు శాతం కంటే తక్కువకు దిగి వచ్చింది. సెప్టెంబర్ నెలలో కూరగాయల ధరలు కాస్త నెమ్మదించడం చిల్లర ద్రవ్యోల్బణం దిగి రావడానికి కారణంగా తెలుస్తోంది. జూలై రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతంగా నమోదైంది.
ఆగస్టులో పట్టణ ద్రవ్యోల్బణం 6.59 శాతం కాగా, సెప్టెంబర్ లో 4.65 శాతం. గ్రామీణ ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.02 శాతం నుంచి సెప్టెంబర్లో 5.33 శాతానికి పడిపోయింది. కూరగాయల ద్రవ్యోల్బణం ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలకు 26.1 శాతం నుంచి 3.4 శాతానికి, తృణధాన్యాల ద్రవ్యోల్బణం ఇంకా నిలకడగా 11 శాతం వద్ద కొనసాగుతున్నాయి. పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం 16.4 శాతం నుంచి 13 శాతానికి పతనమైంది.
పాల ధరలు 7.7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గాయి. కోడిగుడ్ల ధరలు 6.4 శాతం, మాంసం, చేపల ధరలు 4.11 శాతం తగ్గాయి. నూనె గింజల ధరలు 23.1 శాతం నికరంగా కొనసాగుతూ.. ఫండ్ల ధరలు నాలుగు శాతానికి పతనం అయ్యాయి.