హైదరాబాద్, డిసెంబర్ 1: రాష్ట్రానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ కోవాసాంట్..హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నూతన ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీవీ సుబ్రమణ్యం మాట్లాడుతూ..తమ క్లయింట్లకు ఏఐ టెక్నాలజీ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్‌ను నెలకొల్పినట్టు చెప్పారు.
ప్రస్తుతం ఈ కార్యాలయాన్ని 500 మంది కూర్చోవడానికి వీలుండే విధంగా ఈ నూతన ఏఐ సెంటర్‌ను తీర్చిదిద్దినట్టు, 2028 నాటికి ఈ సెంటర్లో ఉద్యోగుల సంఖ్యను 3 వేలకు పెంచుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. సంస్థకు డల్లాస్, న్యూయార్క్, లాస్ ఎంజిల్స్, లండన్, దుబాయ్‌లలో కార్యాలయాలను కలిగివున్నది.