హైదరాబాద్, మే 26: ప్రముఖ పురుగు మందుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్..తాజాగా పంట సంరక్షణ పరిధిలో మరో ఐదు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది.
వీటిలో మూడు ఇన్సెక్టిసైడ్స్ కాగా, 1 హెర్బిసైడ్, 1 ఫంగిసైడ్ ఉత్పత్తులను పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సమీర్ గోయల్ మాట్లాడుతూ..క్రాప్ ప్రొటెక్షన్ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ ఉత్పత్తులను పరిచయం చేసినట్లు చెప్పారు.