ఐదేండ్లలో 5 వేల కోట్ల లాభం
వంటనూనెల విక్రయ సంస్థ పతంజలి ఫుడ్స్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో రూ.5 వేల కోట్ల నిర్వహాణ లాభం, రూ.50 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నది. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ పామ్ రంగంలో ఉన్న భారీ అవకాశాలే ఇందుకు కారణమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా రామ్‌దేవ్ తెలిపారు.
- లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పతంజలి గ్రూపు
న్యూఢిల్లీ, జూన్ 12: వంటనూనెల విక్రయ సంస్థ పతంజలి ఫుడ్స్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో రూ.5 వేల కోట్ల నిర్వహాణ లాభం, రూ.50 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నది. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ పామ్ రంగంలో ఉన్న భారీ అవకాశాలే ఇందుకు కారణమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా రామ్‌దేవ్ తెలిపారు. 2022-23లో రూ.31,821.45 కోట్ల ఆదాయంపై రూ.886.44 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
దీంట్లో వంటనూనెలను విక్రయించడంతో రూ.25,253.33 కోట్లు రాగా, ఫుడ్-ఎఫ్ఎంసీజీ రంగం నుంచి రూ.6,218 కోట్లు సమకూరింది. కంపెనీకి వచ్చిన ఆదాయంలో ఫుడ్-ఎఫ్ఎంసీజీ వ్యాపారం భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ఏడాది క్రితం 7 శాతంగా ఉన్న ఈ విభాగ వాటా గడిచిన ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి చేరుకున్నదన్నారు. దేశవ్యాప్తంగా సంస్థ 63,816 హెక్టార్లలో పామాయిల్‌ను పండిస్తున్నది. 2019లో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్..రుచీ సోయా ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

