హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కంప్యూటర్ గేమింగ్ దిగ్గజ సంస్థ ఎలక్ట్రానిక్ ఆర్ట్(ఈఏ) తాజాగా హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. రాయదుర్గం ఐటీ కారిడార్లోని నాలెడ్జ్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించింది.
ఇప్పటికే సంస్థకు ఇక్కడే ఆఫీస్ నిర్వహిస్తున్నది. నగరంలో గేమింగ్ కార్యకలాపాలకు అనుగుణంగా ఉండటంతోపాటు నైపుణ్యం కలిగిన టెక్నాలజీ నిపుణులు లభిస్తుండటంతో ఇక్కడే తమ వ్యాపారాన్ని విస్తరించినట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం గేమింగ్, యానిమేషన్ రంగ అభివృద్ధి కోసం ఇమేజ్ టవర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.