న్యూయార్క్ : శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన వీడియో గేమ్ సాఫ్ట్వేర్ కంపెనీ యూనిటీ 3.8 శాతం ఉద్యోగులను (Layoffs) సాగనంపనుంది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రియాలజీ డైరెక్టర్ పీటర్ జాక్సన్‌కు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ వీటా డిజిటల్ ఒప్పందం రద్దుచేసుకోవడంతో ఏకంగా 265 మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. యూనిటీ కార్యకలపాలను క్రమబద్ధీకరిస్తూ కీలక వ్యాపార విభాగాలపై దృష్టి సారించడంలో భాగంగా యూనిటీ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.
కొలువుల కోతతో పాటు బెర్లిన్, సింగపూర్‌లో కార్యాలయాలను యూనిటీ మూసివేయనుంది. శాన్ఫ్రాన్సిస్కోచ బెల్లెవ్, వాషింగ్టన్ సహా పలు లొకేషన్స్‌లో కంపెనీ కార్యాలయాల సంఖ్యను కుదించనుంది. ఇక వీటా డిజిటల్‌కు టెక్నికల్ సపోర్ట్‌తో పాటు ఇతర సేవలు అందించే ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న 265 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించాల్సి వచ్చింది.
ఇక యూనిటీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూనిటీ పోకేమాన్ గో క్రియేషన్‌లో కీలక పాత్ర పోషించింది. ఇక వ్యాపారాలపై రీఫోకస్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని యూనిటీ టెక్నాలజీస్ సీఈవో జేమ్స్ వైట్‌హస్ట్ వెల్లడించారు.
Read More :
AI | ఏఐతో అకౌంటెంట్ల ఉద్యోగాలకు ఎసరు