న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవో) ద్వారా ఆయా కంపెనీలు సమీకరించిన నిధులు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 26 శాతం తగ్గాయి. ప్రైమ్ డాటాబేస్ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2022 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో 14 ఇష్యూల ద్వారా రూ.35,456 కోట్లు సమకూరగా, ఈ ఏడాది ప్రధమార్థంలో ఇష్యూల సంఖ్య రెట్టింపునకుపైగా పెరిగి 31కు చేరినప్పటికీ, అవి సేకరించిన నిధుల మొత్తం మాత్రం రూ.26,300 కోట్లకు తగ్గింది. అయితే 2022 మే నెలలో వచ్చిన ఎల్ఐసీ ఐపీవోను మినహాయిస్తే ఈ ఏడాది నిధుల సమీకరణ 76 శాతం పెరిగిందని ప్రైమ్ డాటా బేస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ హాల్దియా తెలిపారు. వివరాలు&