CMF Phone 1 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ (CMF) భారత్ మార్కెట్లోకి తన సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1) సోమవారం ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ఎస్వోసీతో వస్తు్న్న సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1).. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. డ్యుయల్ 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా యూనిట్ తో వస్తున్నది.
సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1) ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999లకు లభిస్తుంది. బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్. ఈ నెల 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, సీఎంఎఫ్ వెబ్ సైట్, రిటైల్ పార్టనర్స్ షాపుల్లో లభిస్తుంది. స్పెషల్ బ్యాంక్ ఆఫర్లతో ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద బేస్ వేరియంట్ రూ.14,999, టాప్ ఎండ్ మోడల్ రూ.16,999లకు సొంతం చేసుకోవచ్చు. తొలి వంద మంది కస్టమర్లకు సీఎంఎఫ్ బడ్స్ ఫ్రీగా లభిస్తాయి. ఈ నెల తొమ్మిదో తేదీన బెంగళూరులోని లులూ మాల్లో కస్టమర్లకు లిమిటెడ్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి.
సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.6 వర్షన్ మీద పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2400 పిక్సెల్స్) అమోలెడ్ ఎల్టీపీఎస్ డిస్ ప్లే కలిగి ఉంటది. 395 పీపీై పిక్సెల్ డెన్సిటీ, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటది.
సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1) ఫోన్ ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్లో వర్చువల్‌గా 16 జీబీ వరకూ ర్యామ్ పెంచుకోవచ్చు. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ అన్ స్పెషిఫైడ్ సోనీ సెన్సర్ ఎలాంగ్ విత్ సపోర్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్), 2ఎక్స్ జూమ్ తో పోర్ట్రైట్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 256 జీబీ వరకూ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఆప్షన్ తోపాటు 2 టిగా బైట్ల వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవడానికి మద్దతుగా ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సీ-పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ అండ్ సెక్యూరిటీ కోసం ఆప్టికల్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది.
33వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 5వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నదీ సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1). సింగిల్ చార్జింగ్ తో రెండు రోజుల వరకూ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 20 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది.
Mahindra Scorpio- N | మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో కొత్త ఫీచర్లు.. అవేమిటంటే..?!
Moto G85 5G | 10న భారత్ మార్కెట్లోకి మోటో జీ85 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
Ayushman Bharat | రూ. 10 లక్షల వరకూ ఆయుష్మాన్ భారత్ లిమిట్..?!