హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు హాజరు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ను ఇండస్ట్రీ ప్రతినిధులు హైదరాబాద్‌లో కలిశారు. ‘వన్ నేషన్-వన్ ఎక్స్పో’ థీమ్‌తో 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా వారు వివరించారు.
కాగా, ఈ నెల 28 వరకు జరుగబోయే ఈ ఎక్స్‌పోలో 1,500 మందికిపైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. సైస్టెనబుల్ ఫీడ్ సొల్యూషన్స్, ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధులు, ఎరువుల నిర్వహణ, భవిష్యత్ ఉద్యోగావకాశాలు వంటి అంశాలపై చర్చించనున్నారు.