Citroen C3 | ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ తన హ్యాచ్ బ్యాక్ సిట్రోన్ సీ3పై ధర భారీగా తగ్గించింది. తగ్గించిన ధరలు ఈ నెలాఖరు వరకూ అమల్లో ఉంటాయి. అత్యధికంగా రూ.57 వేల వరకూ రాయితీ లభిస్తుంది. ఇక వచ్చేనెల నాలుగో తేదీ వరకూ `కేర్ ఫెస్టివల్` పేరిట సిట్రోన్ తన కార్లకు సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్నది.
సిట్రోన్ సీ3 లైవ్ వేరియంట్ అసలు ధర రూ.6.16 లక్షలు కాగా, డిస్కౌంట్‌పై రూ.5.99 లక్షలకు పొందొచ్చు. `ఫీల్` వేరియంట్ రూ.7.08 లక్షలు పలుకుతుండగా, రూ.55 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. షైన్ వేరియంట్ అసలు ధర రూ.7.60 లక్షలకు లభిస్తుండగా, డిస్కౌంట్‌పై రూ.7.03 లక్షలకు విక్రయిస్తున్నది. అంటే గరిష్టంగా షైన్ వేరియంట్ కారుపై రూ.57 వేల డిస్కౌంట్ అందుతుందన్నమాట. ఫీల్ టర్బో వేరియంట్‌పై రూ.49 వేలు, షైన్ టర్బో మోడల్ కారుపై రూ.51 వేల రాయితీ పొందొచ్చు.
సిట్రోన్ సీ3 కారు 1.2 లీటర్ల ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ అత్యధికంగా 81 బీహెచ్పీ విద్యుత్, 115 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుందీ కారు. ఇంకా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తోకూడిన 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ కూడా వస్తుంది. ఈ కారు గరిష్టంగా 109 బీహెచ్పీ విద్యుత్, 190 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.