Citroen Basalt | ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) తన ఎస్ యూవీ కారు సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) డిజైన్ బయటకొచ్చింది. భారత్ రోడ్లకు అనుగుణంగా సీ-క్యూబ్డ్ ప్రోగ్రామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న నాలుగో కారు ఇది. టాటా మోటార్స్ కర్వ్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు వస్తున్న సిట్రోన్ తొలి ప్రాపర్ ఎస్యూవీ కూపె కారు కూడా.
సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ రీసెంబుల్ చేసినట్లు డిజైన్ కనిపిస్తుంది. ఫ్రంట్ లో గ్రిల్లె ఇన్సర్ట్స్ తో డిఫరెంట్ లుక్ కలిగి ఉంటుందీ కారు. ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తోపాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బూట్ లిడ్ వద్ద రూఫ్ లైన్ స్లోపింగ్ డౌన్ తో వస్తోంది. టాప్ హై ఎండ్ బసాల్ట్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో వస్తోంది. హలోజన్ టెయిల్ ల్యాంప్స్, చంకీ బంపర్ తో అందుబాటులో ఉంటుంది.
సీ3 ఎయిర్ క్రాస్ కారును పోలి ఉంటుందీ సిట్రోన్ బసాల్ట్ క్యాబిన్. న్యూ హెచ్వీఏసీ ప్యానెల్ విత్ డిజిటల్ రీడౌట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లార్జర్ ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, న్యూ హెడ్ రెస్ట్స్, రేర్ సీట్లలో అడ్జస్టబుల్ థై సపోర్ట్ స్క్వాబ్స్ ఉంటాయి. సిట్రోన్ బసాల్ట్ కారు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, 7- అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానెల్ ఉంటాయి. సీ3 ఎయిర్ క్రాస్ కారుల మాదిరే స్టీరింగ్ వీల్, క్యాబిన్ సర్పేసెస్ ఉంటాయి.
సిట్రోన్ బసాల్ట్ కారు 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్లతో వస్తున్నాయి. 1.2 లీటర్ల నేచురల్లీ పెట్రోల్ వేరియంట్ 82 బీహెచ్పీ, 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ 110 బీహెచ్పీ విద్యుత్ వెలువరిస్తాయి. రెండు ఇంజిన్లు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉన్నా, టర్బో పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటాయి. త్వరలో మార్కెట్లోకి రానున్న టాటా కర్వ్ తోపాటు హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.