న్యూఢిల్లీ, మే 1: యాక్సిస్ బ్యాంక్ బ్రాండ్లోకి సిటీ బ్యాంక్ కస్టమర్ల కార్డుల మార్పు ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు సదరు ఖాతాదారులకు సందేశాలు వస్తున్నాయి. సిటీ బ్యాంక్ భారతీయ రిటైల్ వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సిటీ బ్రాండ్ కింద ఉన్న కార్డుల రీబ్రాండింగ్ జరుగుతున్నది. ఈ క్రమంలోనే తమ కొత్త ఐఎఫ్ఎస్సీని అప్డేట్ చేసుకోవాలని కార్డుదారులను యాక్సిస్ బ్యాంక్ కోరుతున్నది. కాగా, కార్డు బ్రాండ్ ఒక్కటే మారనున్నది. సిటీకి బదులు యాక్సిస్ అని వస్తుంది. దాని మీదున్న నంబర్లన్నీ అలాగే ఉండనున్నాయని గతంలోనే యాక్సిస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ చౌదరి చెప్పారు.