న్యూఢిల్లీ, డిసెంబర్ 22 : ప్రముఖ ఔషధరంగ సంస్థ సిప్లా.. దేశీయ మార్కెట్లోకి మధుమేహ (షుగర్ లేదా డయాబెటిస్) వ్యాధిగ్రస్తుల కోసం ‘అఫ్రెజా’ పేరిట ఓ ఇన్సులిన్ పౌడర్‌ను తీసుకొచ్చింది. నోటి ద్వారా దీన్ని తీసుకోవచ్చని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
సింగిల్-యూజ్ క్యాట్రిడ్జ్‌లలో ఇది లభిస్తుందని, వైద్యులు సూచించిన మోతాదులో ఇన్హేలర్ డివైజ్‌ల ద్వారా పౌడర్‌ను వాడాల్సి ఉంటుందన్నది. ప్రస్తుతం భారత్‌లో మధుమేహంతో బాధపడుతున్న పెద్దలు 10 కోట్లకుపైగానే ఉన్నట్టు వెల్లడించింది.