Layoffs : జర్మన్ కెమికల్స్ దిగ్గజం ఎవోనిక్ ఇండస్ట్రీస్ లేఆఫ్స్ ప్రకటించింది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో 2026 నాటికి 2000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించించి. 2024లో ఎలాంటి రికవరీ చోటుచేసుకుంటుందని తాము అంచనా వేయడం లేదని స్పష్టం చేసింది.
లేఆఫ్స్ ప్రక్రియ పూర్తయితే దీని ద్వారా ఏటా 400 మిలియన్ యూరోలు ఆదా అవుతాయని కంపెనీ భావిస్తోంది. లేఆఫ్స్‌లో భాగంగా కేవలం జర్మనీలోనే 1500 మంది ఉద్యోగులపై వేటు పడనుంది. ఆర్ధిక వాతావరణం ప్రతికూలంగా మారడంతో వ్యాపారంలో తీవ్ర అనిశ్చితి నెలకొందని సీఈవో క్రిస్టియన్ కుల్మన్ పేర్కొన్నారు.
పారిశ్రామిక క్లైంట్స్ నుంచి డిమాండ్ తగ్గడంతో ఎవోనిక్ వంటి కెమికల్ కంపెనీలు ఏడాదిగా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఇన్వెంటరీలు తగ్గుముఖం పట్టి కంపెనీలను ఆర్ధిక కష్టాలు వెంటాడుతున్నాయి.
Read More :