ChatGPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intellegence)తో వచ్చిన చాట్ బోట్.. చాట్‌జీపీటీ (ChatGPT) ఇప్పటి వరకూ యూజర్లకు టెక్ట్స్ మెసేజ్‌లపై సమాధానాలు ఇస్తూ వచ్చింది. వాట్సాప్ యూజర్లకు ఓపెన్ ఏఐ టెక్ట్స్ మెసేజ్‌లు అందిస్తోంది. ఇందుకోసం గతేడాది డిసెంబర్లో చాట్‌జీపీటీ అధికారికంగా ఓ ఫోన్ నంబర్ అందిస్తోంది. తాజాగా వాయిస్ మెసేజ్‌లు, ఇమేజ్ ఇన్పుట్లపైనా చాట్‌జీపీటీ స్పందించనున్నది.
తాజాగా యూజర్లు ఏదైనా ఇమేజ్ వాట్సాప్‌లో అప్లోడ్ చేసి, ప్రశ్న వేస్తే చాట్‌జీపీటీ జవాబు ఇస్తుంది. అలాగే వాయిస్ ఇన్పుట్ అప్లోడ్ చేసినా జవాబు లభిస్తుంది. అంటే టెక్ట్స్, వాయిస్ మెసేజ్, ఇమేజ్ రూపంలో ఏది అప్లోడ్ చేసినా టెక్ట్స్ రూపంలోనే చాట్ జీపీటీ రిప్లయ్ వస్తుంది. చాట్ జీపీటీ సేవల కోసం ఓపెన్ ఏఐ గతేడాది డిసెంబర్లో +18002428478 నంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ నంబర్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకుని యూజర్లు అడిగే ప్రశ్నలకు చాట్‌జీపీటీ జవాబులిస్తుంది.
గతంలో చాట్‌జీపీటీ వెబ్సైట్, యాప్ డౌన్లోడ్ చేసుకున్న యూజర్లకే ఈ చాట్‌బోట్ సేవలు అందుబాటులో ఉండేవి. కానీ, తాజా ఫీచర్‌తో టెక్ట్స్, వాయిస్ లేదా ఇమేజ్ ఇన్పుట్ సాయంతో వాట్సాప్ ద్వారానే చాట్‌జీపీటీ నుంచి సమాధానాలు పొందొచ్చు. అయితే, రోజువారీ వాడకానికి పరిమితులు ఉంటాయి. లిమిట్ దగ్గర పడింతర్వాత నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అందుతుంది.