కీలక రంగాల్లో నిస్తేజం.. నిరాశపర్చిన బొగ్గు, ముడి చమురు, ఎరువుల ఉత్పాదకత
గత నెల మార్చిలో ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ (ఐసీఐ)లో ఉత్పాదకత భారీగా పడిపోయింది. సోమవారం వెల్లడైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. బొగ్గు, ముడి చమురు, ఎరువుల రంగాల పనితీరు పెద్ద ఎత్తునే మందగించింది.
- మార్చిలో ఐసీఐ 0.4 శాతానికి పరిమితం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: గత నెల మార్చిలో ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ (ఐసీఐ)లో ఉత్పాదకత భారీగా పడిపోయింది. సోమవారం వెల్లడైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. బొగ్గు, ముడి చమురు, ఎరువుల రంగాల పనితీరు పెద్ద ఎత్తునే మందగించింది. దీంతో 8 కీలక రంగాల్లో ఓవరాల్గా ఉత్పత్తి రేటు 0.4 శాతానికి పరిమితమైంది. ఇది గడిచిన 19 నెలల్లోనే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. 2024 ఆగస్టు తర్వాత ఇదే. ఉక్కు, సిమెంట్, రిఫైనరీ ఉత్పత్తుల తయారీ సైతం ఆకర్షణీయంగా లేదు.
సహజ వాయువు ఉత్పత్తి పెరిగినా.. గడిచిన 5 నెలల్లో తొలిసారి పతనం తప్పలేదు. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ 8 కీలక రంగాల వృద్ధిరేటు 2.8 శాతంగా ఉన్నది. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఈ రంగాల్లో ప్రగతి 2.6 శాతంగా రికాైర్డెంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25) 4.5 శాతంగా ఉండటం గమనార్హం.
రంగాలవారీగా..
మార్చిలో బొగ్గు ఉత్పత్తి 4 శాతం, ముడి చమురు 5.7 శాతం, ఎరువులు 24.6 శాతం, విద్యుత్తు 0.5 శాతం చొప్పున పడిపోయింది. అలాగే రిఫైనరీ ఉత్పత్తుల తయారీలో వృద్ధి 0.1 శాతం, ఉక్కు 2.2 శాతం, సిమెంట్ 4 శాతానికి పరిమితమైంది. అత్యధికంగా సహజ వాయువు ఉత్పాదకత 6.4 శాతం పెరిగింది. కాగా, ఐసీఐ వాటా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ)లో 40 శాతంగా ఉంటుంది. ఈ క్రమంలో రాబోయే ఐఐపీ గణాంకాల్లో పతనం తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చికిగాను విడుదలయ్యే పారిశ్రామికోత్పత్తి సూచీ దాదాపు 1-2 శాతం మందగించవచ్చని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ అంటున్నారు. ఫిబ్రవరిలో 5.2 శాతం వృద్ధి ఉన్నట్టు గుర్తుచేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

