హైదరాబాద్: సెంచురీ మ్యాట్రెస్.. రాష్ట్రంలో తమ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. వచ్చే ఏడాదిన్నరకాలంలో మరో 100 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ను కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలాని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్లెట్లలో ఇది వందోదని, వచ్చే రెండేండ్ల కాలంలో మరో 100 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ఆరంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు రాష్ట్రంలో మూడు పరుపుల తయారీ యూనిట్లు ఉండగా, మార్కెట్లో కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండటంతో వీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.