శనివారం 06 మార్చి 2021
Business - Jan 01, 2021 , 02:32:47

కేంద్రం అప్పులు రూ.107 లక్షల కోట్లు

కేంద్రం అప్పులు రూ.107 లక్షల కోట్లు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 31: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్‌)లో కేంద్ర ప్రభుత్వ అప్పులు 5.6 శాతం పెరిగాయి. 2020 సెప్టెంబర్‌ చివరి నాటికి మొత్తం అప్పులు 107.04 లక్షల కోట్లకు చేరినట్లు తాజా నివేదికలో కేంద్రం స్పష్టం చేసింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.101.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో రాబడులపై ఒత్తిడి పెరుగడం వల్ల క్యూ2లో అప్పుల భారం అధికమైనట్లు కేంద్రం పేర్కొన్నది. ఈ నివేదిక ప్రకారం.. 2020 సెప్టెంబర్‌ చివరి నాటికి మొత్తం అప్పుల్లో 91.1 శాతం ప్రభుత్వ రుణం పేరుకుపోయింది. 2020 జులై-సెప్టెంబర్‌ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం 13 విడతల్లో రూ.4.20 లక్షల కోట్ల డేటెడ్‌ సెక్యూరిటీలను విడుదల చేసింది. వీటిలో వాణిజ్య బ్యాంకులు 38.6 శాతం, బీమా కంపెనీలు 26.2 శాతం కొనుగోలు చేశాయి. ఈ బాండ్ల ద్వారా సగటున 5.80 శాతం ఆదాయం సమకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

VIDEOS

logo