సెంట్రల్ బ్యాంక్ లాభం రెండింతలు
ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.605 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది.
- క్యూ2లో రూ.605 కోట్లుగా నమోదు
ముంబై, అక్టోబర్ 20: ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.605 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.318 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది. స్థూల నిరర్థక ఆస్తుల విలువ 505 బేసిస్ పాయింట్లు పెరిగి 4.62 శాతానికి తగ్గడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొంది. అలాగే బ్యాంక్ నికర ఎన్పీఏ 2.05 శాతం నుంచి 1.64 శాతానికి దిగొచ్చింది.
ప్రొవిజన్ కవరేజ్ రేషియో 89.20 నుంచి 92.54కి పెరిగింది. గత త్రైమాసికం చివరినాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.6 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించి రూ.6,02,284 కోట్లకు చేరుకున్నది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,40,130 కోట్లతో పోలిస్తే 11.51 శాతం అధికం. దీంట్లో డిపాజిట్లు 8.21 శాతం అధికమై రూ.3,71,252 కోట్లకు చేరుకోగా, అడ్వాన్స్‌లు 17.26 శాతం ఎగబాకి రూ.2,31,032 కోట్లకు చేరాయి.
నికర వడ్డీ ఆదాయం 10.23 శాతం ఎగబాకి రూ.2,747 కోట్ల నుంచి రూ.3,028 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్ ఆదాయం 19.07 శాతం ఎగబాకి రూ.7,065 కోట్ల నుంచి రూ.8,412 కోట్లకు చేరుకున్నట్టు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్‌కు 4,489 శాఖలు ఉండగా, వీటిలో సగం గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

