Videocon loan fraud case | వీడియోకాన్ రుణ వ్యవహారంలో అరెస్టైన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు ముంబయి సీబీఐ స్పెషల్ కోర్టు జుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ నిమిత్తం వారిని 14 రోజులు జుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది.
చందా కొచ్చర్ సీఈవోగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ కంపెనీ రూ.3,200 కోట్లకుపైగా లోన్ తీసుకుంది. ఈ లోన్ మంజూరు సమయంలో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వీరిద్దరినీ ఈనెల 23న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరికి పలుమార్లు రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు.. తాజాగా విచారణ నిమిత్తం వారిని జుడీషియల్ కస్టడీకి అనుమతించింది.