NSE Co-Location Scam | ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్ర అరెస్ట్
NSE Co-Location Scam | ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్ కేసులో ఆ సంస్థ మాజీ సీఈవో కం ఎండీ చిత్రా రామకృష్ణను సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది.
NSE Co-Location Scam |నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణకు సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసింది. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెను అదుపులోకి తీసుకున్నది. ఢిల్లీలో చిత్రా రామకృష్ణను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. దవాఖానలో ఆమెకు వైద్య పరీక్షలు జరిపించారు. అటుపై సీబీఐ కేంద్ర కార్యాలయంలోని లాకప్కు తరలించారు.
అంతకుముందు వరుసగా మూడు రోజులుగా చిత్రా రామకృష్ణను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె నివాసంలో తనిఖీలు జరిపారు. కానీ తమ విచారణలో ఆమె సరైన జవాబులివ్వడం లేదని సీబీఐ అధికారులు తెలిపారు. ఆమెను ప్రశ్నించడానికి ముందు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) సీనియర్ సైకాలజిస్టుతో సీబీఐ అధికారులు చికిత్స చేయించారు.
విచారణలో చిత్రా రామకృష్ణ జవాబులు దాటవేస్తున్నారని సీఎఫ్ఎస్ఎల్ సైకాలజిస్టు సైతం ధృవీకరించారు. ఆమెను అరెస్ట్ చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చేశారు. చిత్రా రామకృష్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

