
Car Polish/ Wax | కారు వ్యాక్స్ పూర్తిగా నెయిల్ పాలిష్ మాదిరిగానే పని చేస్తుంది. తర్వాత పాలిషింగ్కు వెళ్లినా, చేతి వేలిపై గోరుకు మాదిరిగానే కారుకు వేసిన ప్రొటెక్టివ్ కోటింగ్ రక్షణ కల్పిస్తుంది. ఇదే పని కారు వ్యాక్స్ చేస్తుంది. కోటింగ్ ఇచ్చిన తర్వాత కారును వ్యాక్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే ఆల్ట్రా వయొలెట్ కిరణాలను నిరోధించే శక్తి, సామర్థ్యం ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన వ్యాక్స్లకు ఉంటుంది.
కారుపై ఏదైనా మరక పడ్డా, చిన్న పాటి గీతలు పడ్డా పాలిష్ వాటిని తొలగించేస్తుంది. పాలిషింగ్ వల్ల కారుపై ఉన్న పెయింట్ ఆక్సిడేషన్కు గురై దాని మెరుపు కనుమరుగవుతుంది. పాలిషింగ్లో రాపిడి లక్షణాల నేపథ్యంలో నిరంతరం కార్లపై పాలిషింగ్ చేయాలని నిపుణులు సూచించరని చెబుతున్నారు.
మీరు మీ కార్లకు పాలిష్ లేదా వ్యాక్స్ వేయాలని నిర్ణయానికి వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా క్లీన్ చేసి డ్రైగా ఉంచాలి. తర్వాత మీ చేతి వేళ్లను కారు పెయింటింగ్ మీదుగా కదిపితే అక్కడక్కడ గీతలు తగులుతాయి. కారు తయారీ దారు సిఫారసు మేరకు మీ కారుపై పాలిషింగ్ లేదా వ్యాక్స్ పెయింట్ చేయాలి. బంపర్ల మీద ఏమనా తేడాలుంటే ముందుగా పాలిష్ చేశాకే కారుకు వ్యాక్స్ అప్లయ్ చేయాలి.
తరుచుగా కారు పాలిష్ వాడినా టాప్ కోట్ గీరకపోయినట్లు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కారుకు రీ పెయింటింగ్ వేయాల్సిన అవసరం వస్తుంది. కొన్ని పాలిష్ల్లో ఉండే పాలిమర్ మిక్సెస్తో కారుకు నష్టం కలిగిస్తాయి. కానీ వ్యాక్స్ నిరంతరం వాడాలి. అది వేడిగా ఉన్నప్పుడు అప్లయ్ చేస్తే సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాలు కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.