MI vs PBKS : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన పంజాబ్ కింగ్స్ తడబడినా చివరకు భారీ స్కోర్ కొట్టింది. ధర్మశాలలో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(57) అర్ధ శతకంతో చెలరేగినా.. శార్దూల్ ఠాకూర్(4-39) సూపర్ స్పెల్‌తో మిడిలార్డర్ కుప్పకూల్చాడు. దీపక్ చాహర్(2-36) సైతం బెంబేలెత్తించగా పంజాబ్ స్కోర్ 150 దాటితే గొప్ప అనిపించింది. కానీ, అజ్మతుల్లా ఒమర్జాయ్(38), ఇంప్యాక్ట్ సబ్ విష్ణు వినోద్(15 నాటౌట్), బార్ట్లెట్(18 నాటౌట్)లు డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడగా అయ్యర్ సేన ముంబై ముందు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించినా.. బుమ్రా దళం గొప్పగా కట్టడి చేసింది. బుమ్రా ఓవర్లో 5 పరుగుల వద్ద స్లిప్‌లో నమన్ ధిర్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన ప్రభ్‌సిమ్రన్ సింగ్(57) ఆ తర్వాత బంతినే బౌండరీకి పంపాడు. కానీ, పవర్ ప్లే చివరి ఓవర్లో ప్రియన్ష్ ఆర్య(22)ను బౌల్డ్ చేసి ముంబైకి బ్రేకిచ్చాడు దీపక్ చాహర్. అనతరం కూపర్ కొన్నొల్లి(21)తో కలిసి దంచేసి.. అర్ధ శతకంతో స్కోర్ వంద దాటించాడు. అదే ఊపులో.. శార్దూల్ ఠాకూర్(4-39) ఓవర్లో సిక్సర్ బాదిన ప్రభ్సిమ్రాన్ ఆ తర్వాత బంతిని అంచనా వేయలేక బాస్చ్ చేతికి దొరికాడు.
#MI bowlers on the mark 🎯
🎥 Shardul Thakur and Raj Bawa hitting the top of off 😮🔥
Updates ▶️ https://t.co/idtc2OTLbP#TATAIPL | #KhelBindaas | #PBKSvMI | @mipaltan pic.twitter.com/eGyWOeXudm
— IndianPremierLeague (@IPL) May 14, 2026
వస్తూనే ఫోర్ బాదిన శ్రేయస్ అయ్యర్(4) ఆ తర్వాతి బంతికే బౌల్డవ్వడంతో శార్దూల్ సంబరాలు చేసుకున్నాడు. డెత్ ఓవర్లలో దంచేసే మార్కో యాన్సెన్()ను సైతం శార్దూల్ బౌల్డ్ చేయడంతో పంజాబ్ స్కోర్ దాటితే గొప్ప అనిపించింది. కానీ, చాహర్ ఓవర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్(38).. 4, 6, 6 తో రెచ్చిపోయాడు. ఆ తర్వాత.. ఇంప్యాక్ట్ సబ్ విష్ణు వినోద్(15 నాటౌట్), బార్ట్లెట్(18 నాటౌట్) ధాటికి బాస్చ్ 22 రన్స్ ఇచ్చాడు. బుమ్రా చివరి ఓవర్లో పరుగలు రావడంతో పంజాబ్ అనూహ్యంగా రెండొందల మార్క్ అందుకుంది.
Snatched the momentum right back! 🔥#PBKS with the perfect finish to put 2️⃣0️⃣0️⃣ on the board 👊
Updates ▶️ https://t.co/idtc2OTLbP#TATAIPL | #KhelBindaas | #PBKSvMI | @PunjabKingsIPL pic.twitter.com/5uwUHZRQQO
— IndianPremierLeague (@IPL) May 14, 2026