SUV Car Sales | సప్లయ్-చైన్ సమస్యలు తగ్గడంతోపాటు డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లో కార్ల అమ్మకాలు పెరిగాయి. ప్రత్యేకించి ఎస్యూవీ కార్లకు గిరాకీ ఎక్కువైంది. 2022 జూన్ నెలతో పోలిస్తే, గత నెల 1.90 శాతం గ్రోత్ నమోదైంది. ఈ ఏడాది 3,27,700 కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూన్ నెలలో 3,21,600 కార్లు మాత్రమే అమ్ముడు పోయాయి.
మొత్తం కార్ల విక్రయంలో ఎస్‌యూవీల వాటా 43 శాతం. టాప్ బెస్ట్ సెల్లింగ్ 10 కార్లలో ఆరు ఎస్‌యూవీలే నిలవడం గమనార్హం. వాటిల్లో హ్యుండాయ్ క్రెటా, టాటా నెక్సాన్, హ్యుండాయ్ వెన్యూ, టాటా పంచ్, మారుతి సుజుకి బ్రెజా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మోడల్ కార్లు ఉన్నాయి.
గతేడాది జూన్ నెలతో పోలిస్తే గత నెలలో మారుతి సుజుకి కార్ల సేల్స్ 8.43 శాతం పెరిగి 1,33,027 (2022 జూన్‌లో 1,22,685) యూనిట్ల సేల్స్ నమోదయ్యాయి. హ్యుండాయ్ మోటార్స్ 2022తో పోలిస్తే ఈ ఏడాది 2.04 శాతం వాటా పెంచుకుని 49,001 యూనిట్ల నుంచి 50,001 యూనిట్ల కార్లు విక్రయించింది.
మూడో స్థానంలో నిలిచి టాటా మోటార్స్ 4.51 శాతం గ్రోత్ నమోదు చేసింది. గతేడాది 45,197 కార్లు విక్రయించిన టాటా మోటార్స్. .ఈ ఏడాది 47,235 యూనిట్లకు దూసుకెళ్లింది. నాలుగో స్థానంలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా 26,880 యూనిట్ల నుంచి 32,588 యూనిట్లకు పెంచుకున్నది.