ముంబై, అక్టోబర్ 25: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కి చెందిన వర్చూస్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన రెండేండ్లలోనే 50 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. సరాసరిగా ఒక్కరోజు 60 యూనిట్ల వర్చూస్ కారు అమ్ముడైందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు.
ఈ ఏడాదిలో 17 వేల కార్లు అమ్ముడయ్యాయి. వర్చూస్ జీటీ లైన్, వర్టస్ జీటీ ప్లస్ స్పోర్ట్ మాడళ్లను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రీమియం సెడాన్ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్నది వర్చూస్ అని ఆయన చెప్పారు. ప్రస్తుతేడాది రెండో త్రైమాసికం ముగిసేనాటికి వర్చూస్, టైగూన్ లక్ష వాహనాలు అమ్ముడయ్యాయి.