హైదరాబాద్, మే 25: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ప్రత్యేక డిపాజిట్ స్కీంను ప్రవేశపెట్టింది. డిపాజిట్‌దారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ‘కెనరా గ్రీన్ డిపాజిట్ స్కీం’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1111, 2222, 3333 రోజుల కాలపరిమితితో డిపాజిట్లపై 7.20 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. ఈ ప్రత్యేక డిపాజిట్ స్కీంలో భారతీయులతోపాటు ప్రవాస భారతీయులు కూడా డిపాజిట్ చేయవచ్చునని తెలిపింది.