న్యూఢిల్లీ, మే 11: కెనరా బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,506 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5 వేల కోట్ల లాభంతో పోలిస్తే 10 శాతం పతనం చెందింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 1.85 శాతం తగ్గి రూ.36,662 కోట్లకు పరిమితమైంది. దీంట్లో నికర వడ్డీ ఆదాయం మాత్రం నాలుగు శాతం ఎగబాకి రూ.9,808 కోట్లకు చేరుకున్నది.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.94 శాతం నుంచి 1.84 శాతానికి దిగొచ్చాయి. అలాగే నికర నిరర్థక ఆస్తుల విలువ 0.7 శాతం (రూ.7,353 కోట్లు) నుంచి 0.43 శాతానికి(రూ.5,209 కోట్లకు) తగ్గాయి. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిషేరుకూ రూ.4.20 డివిడెండ్ ప్రకటించింది.