న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నది. దీంతో రుణాలపై వడ్డీరేటు మరింత అధికమవనున్నది. పెరిగిన వడ్డీరేట్లు బుధవారం నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతానికి చేరుకోనున్నది. అంతకుముందు ఇది 7.65 శాతంగా ఉన్నది. ఒక్కరోజు, నెల కాలపరిమితి రుణాలపై వడ్డీని 10 బేసిస్ పాయింట్లు సవరించింది. కానీ, మూడు నెలల రుణాలపై వడ్డీరేటును 0.15 శాతం లేదా 15 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణరేటు 7.25 శాతానికి చేరుకున్నది.