Canara Bank | న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ వడ్డీరేట్లను స్వల్పంగా పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఏడాది కాలపరిమితితో తీసుకునే వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు 9 శాతం నుంచి 9.05 శాతానికి చేరాయి. వీటితోపాటు నెల, మూడు, ఆరు నెలల కాలపరిమితితో రుణాలపై రేటు 8.40 శాతం నుంచి 8.85 శాతం స్థాయిలో ఉన్నాయి. పెరిగిన వడ్డీరేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.