బెంగళూరు, మే 31: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. కనీస నగదు నిల్వలు లేని అన్ని రకాల ఎస్బీ ఖాతాలపై విధించే చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. పొదుపు ఖాతాతోపాటు వేతన ఖాతా, ఎన్ఆర్ఐ ఎస్బీ ఖాతాల్లో కనీస నిల్వలు లేకున్నా వీరిపై జరిమానా విధించడం లేదని బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రాజు వెల్లడించారు.
లాభాల్లో బ్రైట్‌కామ్
హైదరాబాద్, మే 31: బ్రైట్‌కామ్ గ్రూపు అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన మూడింతలు పెరిగి రూ.120.68 కోట్లకు ఎగబాకినట్టు ప్రకటించింది. కంపెనీ ఆదాయం రూ.987.48 కోట్లకు చేరుకున్నది.