Cafe Coffee Day | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న కేఫ్ కాఫీ డే(సీసీడీ) అవుట్లెట్లు మూతపడుతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి వీటి సంఖ్య 450కి తగ్గినట్లు, ఇదే సమయంలో కార్పొరేట్ స్థలాలు, హోటళ్లలో వెండింగ్ యంత్రాలు మాత్రం 52,581కి పెరగడం విశేషం. అలాగే వాల్యు ఎక్స్‌ప్రెస్ కియోస్క్‌లు కూడా 265కి తగ్గాయని తన వార్షిక నివేదికలో పేర్కొంది.
2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి సీసీడీ 469 కేఫ్స్, 268 సీసీడీ వాల్యు ఎక్స్‌ప్రెస్ కియోస్క్‌లు ఉన్నా యి. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.966 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం కంపెనీకి రూ.1,159 కోట్ల అప్పులు ఉన్నాయి.