కొండాపూర్, నవంబర్ 29: గ్లోబల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ కంపెనీ కన్వర్జ్వన్ (సీ1).. బుధవారం రాయదుర్గం వద్దనున్న సత్వ నాలెడ్జ్ పార్క్లో తమ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ కెపాబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ను ప్రారంభించింది.
20వేల చదరపు అడుగుల్లో తెచ్చిన ఈ సెంటర్ను దేశీయ విభాగం ఎండీ చంద్ర బొడ్డోజుతో కలిసి కంపెనీ సీఈవో జెఫ్రీ రస్సెల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తామన్నారు.