Electric Car- Bank Loan | మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు పర్యావరణం దెబ్బ తింటున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలని ప్రజలను కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఇందుకోసం పన్ను రాయితీలు, ఇతర ఇన్సెంటివ్లు అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇన్నోవేషన్, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన రోజురోజుకు పెరిగిపోతుండటంతో స్టయిలిష్, సేఫ్ ఎలక్ట్రిక్ కార్ల కోసం గిరాకీ పెరుగుతున్నది. ఎలక్ట్రిక్ కార్లను కొనే వారి కోసం పలు బ్యాంకులు సైతం రాయితీలు అందిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందామా..!
సంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి రుణంపై వడ్డీలో 25 బేసిక్ పాయింట్లు తగ్గిస్తోంది ఎస్బీఐ. ఈ నెలాఖరు వరకూ ‘ఫెస్టివ్ ధమాకా’ పేరుతో జీరో ప్రాసెసింగ్ ఫీజు అమల్లో ఉంది. ఎస్బీఐ గ్రీన్ కారు లోన్ (ఎలక్ట్రిక్ కార్ల కోసం) రుణాలపై 8.75-9.45 శాతం మధ్య వడ్డీరేట్లు వసూలు చేస్తున్నది. తాజా రాయితీ ప్రకారం మరో 20 బేసిక్ పాయింట్లు వడ్డీ తగ్గించింది. సెలెక్టెడ్ మోడల్ కార్లపై 90-100 శాతం వరకూ మార్జిన్ లోన్ మంజూరు చేస్తుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) అమలు చేస్తున్న గ్రీన్ మైల్స్ కింద సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీరేట్లు ఖరారు చేస్తుంది. 9.15-12.25 శాతం మధ్య వడ్డీరేట్లు ఉంటాయి. సొంత వనరుల ద్వారా రుణం సర్దుబాటు చేస్తే ప్రీ పేమెంట్ పెనాల్టీ వసూలు చేయదు.
కొత్త ఎలక్ట్రిక్ కార్ల రుణాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వడ్డీలో రాయితీ అందిస్తున్నది. పూర్తి ధరపై ఫైనాన్స్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ రుసుము పూర్తిగా మాఫీ చేసింది. ఉదాహరణకు రుణంపై వడ్డీరేటు 9.75 శాతం ఉంటే 8.75 శాతానికే వడ్డీరేటు ఆఫర్ చేస్తోంది.
ఎలక్ట్రిక్ కారు కోసం రుణం తీసుకునే వారికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలక్ట్రిక్ గ్రీన్ కారు లోన్ స్కీం కింద ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఫీజు రద్దు చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న వడ్డీరేట్ల కంటే .25 శాతం రాయితీ అందిస్తుంది. సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీరేట్లు 8.8 శాతం నుంచి 13 శాతం మధ్య ఖరారు చేస్తుంది. ప్రీ పేమెంట్, ప్రీ క్లోజర్, పార్ట్ పేమెంట్ చార్జీలు ఉండవు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎలక్ట్రిక్ కారు కొనుగోలుదారులకు పలు రకాల రాయితీలు కల్పిస్తోంది. రుణ గ్రహీతలు తమ అవసరాలకు అనుగుణంగా ఫ్లెక్సిబుల్ టెన్యూర్ ఎంచుకోవచ్చు. 12 నెలల నుంచి 96 నెలల లోన్ టెన్యూర్ ఎంచుకోవచ్చు. 21-60 ఏండ్ల మధ్య వేతన జీవులుగా ఉన్నవారు, 21-65 ఏండ్ల మధ్య స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు, భాగస్వామ్య సంస్థలు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంపెనీలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు ఈ బ్యాంకు నుంచి ఎలక్ట్రిక్ కారు రుణాలు పొందొచ్చు.
ఈవీ కారు రుణం తీసుకునే వారు గుర్తింపు, కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. బ్యాంక్ లావాదేవీల స్టేట్ మెంట్, వేతనం లేదా ఐటీ రిటర్న్స్ పత్రాలు సమర్పించాలి. వారి ప్రొఫైల్ ఆధారంగా ఈవీ వాహనాలపై రుణం