Gold Price | పసిడి – వెండి ధరలు ఢమాల్.. ఒక్కరోజే రూ.14,000 తగ్గిన తులం బంగారం
Gold Price | నిన్నమొన్నటిదాకా దేశీయంగా ఆల్‌టైమ్ హై రికార్డులతో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు.. శుక్రవారం భారీగా తగ్గాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు.. ఒక్కరోజే రూ.14,000 (7.65 శాతం) పడిపోయి రూ.1,69,000 (అన్ని పన్నులుతో సహా) వద్ద స్థిరపడింది.
Gold Price | న్యూఢిల్లీ, జనవరి 30 : బులియన్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా దేశీయంగా ఆల్‌టైమ్ హై రికార్డులతో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు.. శుక్రవారం భారీగా తగ్గాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు.. ఒక్కరోజే రూ.14,000 (7.65 శాతం) పడిపోయి రూ.1,69,000 (అన్ని పన్నులుతో సహా) వద్ద స్థిరపడింది. గురువారం రూ.12,000 పుంజుకొని మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,83,000 పలికిన విషయం తెలిసిందే. మరోవైపు వెండి ధర కిలో ఏకంగా రూ.20,000 (దాదాపు 5 శాతం) క్షీణించింది. దీంతో రూ.3,84,500 (అన్ని పన్నులుతో సహా) దగ్గర స్థిరపడింది. అంతకుముందు రోజు రూ.19,500 ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.4,04,500ని చేరిన సంగతి విదితమే.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛ త) పుత్తడి తులం ధర రూ.1,55, 100గా ఉన్నది. ఇక కిలో వెండి రేటు రూ.3,95,000 పలికింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్ నుంచి బలహీన సంకేతాలు, అమెరికా డాలర్ తిరిగి బలపడుతుండటంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని, అందుకే డిమాండ్ పడిపోయి గోల్డ్, సిల్వర్ ధరలు క్షీణించాయని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 285.30 డాలర్లు దిగి 5,087.73 డాలర్లుగా ఉన్నది. ఒకానొక దశలోనైతే 425.86 డాలర్లు పతనం కావడం గమనార్హం. ఔన్స్ సిల్వర్ ధర కూడా 14 డాలర్లు కోల్పోయి 101.47 డాలర్లుగా నమోదైంది. ట్రేడింగ్ మధ్యలోనైతే 95.26 డాలర్ల స్థాయికి పడిపోయింది.
ఫ్యూచర్ మార్కెట్లో..
స్పాట్ మార్కెట్‌తోపాటు ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు బాగా తగ్గిపోయాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 17 శాతం, గోల్డ్ 9 శాతం క్షీణతను చూశాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌పై మార్చి డెలివరీకిగాను వెండి కిలో ధర రూ.3,32,002 పలికింది. క్రితం రోజు ట్రేడింగ్‌తో చూస్తే ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజే రూ.67,891 పడిపోయింది. ఇక ఫిబ్రవరి కాంట్రాక్ట్కుగాను గోల్డ్ 10 గ్రాముల ధర రూ.15,246 క్షీణించి రూ.1,54,157గా నమోదైంది. గురువారం సిల్వర్ రూ.4,20, 048, గోల్డ్ రూ.1,80, 779గా ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయంగా కూడా ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ఆదరణను కోల్పోయాయి. కొమెక్స్లో మార్చి డెలివరీకి ఔన్స్ వెండి 95.12 డాలర్లుగానే ట్రేడైంది. ఏప్రిల్ డెలివరీకి ఔన్స్ గోల్డ్ 4,962.7 డాలర్లుగానే పలికింది. క్రితం రోజు ముగింపుతో చూస్తే.. వరుసగా 19.30 డాలర్లు, 392.10 డాలర్లు నష్టపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

